వరంగల్‌లో ఉగాది ఆధ్యాత్మిక వేడుకలు
ఘనంగా పంచాంగ శ్రవణం
శ్రీ పరాభవ నామ సంవత్సర విశేషాల వివరణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నూతన సంవత్సరంలో రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, దేశకాల పరిస్థితులు ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష పండితుడు డి. రామాచారి తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన విశేషాలను వివరించారు. వరంగల్ జిల్లా శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తున్న పండితులు జి. స్వామినాధ చార్య, ఎ. రంగాచార్య స్వామి, డి. రామాచారి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీవైష్ణవ సంఘం ప్రముఖులు శ్రీ జి. రంగాచార్య, శ్రీ పి. శ్రీనివాస్ చార్య, శ్రీ ఏ. విజయ్ ఆచార్య, శ్రీ శేషాచార్య, శ్రీ కే. వెంకట రమణ, శ్రీ దరిపల్లి శ్రీరాం, శ్రీ మోటుపల్లి వెంకటరమణ, శ్రీ ఎన్.సి.హెచ్. శేషాచార్య, శ్రీ సుదన్వాన్, శ్రీ పొడిచేటి ప్రసాద్, శ్రీధర్ మరియు ఉమ్మడి జిల్లాలోని బ్రాహ్మణ శ్రీవైష్ణవ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


