కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలం జాన్ పాక రైల్వే గేట్ సమీపంలో వారం రోజుల క్రితం ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ కేసులో నిందితులు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన పుల్లగోరు శాంతి కుమార్, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్య వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..గొర్రెకుంట క్రాస్ రోడ్డు సమీపంలో ఎస్‌ఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న ఓ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సదరు నిందితులు ఇద్దరు పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని వెంబడించి పట్టుకుని విచారించారించామన్నారు. విచారణలో తాము ద్విచక్ర వాహనాన్ని జాన్ పాక రైల్వే గేట్ వద్ద నుంచి దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు.


