కాకతీయ, బయ్యారం (గంగారం ): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో మడ గూడెం స్మశాన వాటిక ప్రాంతంలో ప్రధాన రహదారిపై టూవీలర్ వాహనం 102 అంబులెన్స్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వీలర్ వాహనం నడిపే గణేష్ (36) ఆదివారం అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
స్థానికులు తెలిపిన విరాల ప్రకారం గంగారం మండలం జెజ్జరి వారి గుంపు నుంచి కొత్త గూడ మండలానికి వస్తుండగా మార్గమధ్యంలో మడగూడ వద్ద అంబులెన్స్ ఢీ కొన్న ట్లు తెలిపారు.దీనిపై గంగారం ఎస్ ఐ రవికుమార్ ను వివరణ కోరగా మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


