ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
కాకతీయ, రామకృష్ణాపూర్ : గంజాయి అక్రమ రవాణా,విక్రయాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక నిఘాలో ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన గంగాధరి పృధ్వి తేజ, ఎస్కే గౌసియా వద్ద 150 గ్రాముల డ్రై గంజాయి లభించినట్లు చెప్పారు. కాగా గౌసియా నుంచి గంజాయిని కొనుగోలు చేసి పృథ్వి తేజ పట్టణంలో అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1500నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. మందమర్రి ఎస్సై రాజశేఖర్,ఏఎస్సైలు శ్రీనివాస్,వెంకయ్య ఉన్నారు.


