బాలసదానం నుంచి ఇద్దరు బాలికలు పరార్
రెండు రోజుల క్రితం బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఆ తర్వాత అదృష్యమైన బాలికలు
కాకతీయ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలకేంద్రంలోని బాలల సదనం నుంచి ఇద్దరు బాలికలు పరారయ్యారు. ఈసంఘటన శనివారంఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం నుంచి బాలల సదనం నుంచి కనిపించకుండా పోయినట్లుగా అధికారులు మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ ఇద్దరు బాలికలు.. ఇద్దరు బాలురతో భద్రాచలంలో వివాహం చేసుకునేందుకు యత్నించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీడబ్ల్యూసీ అధికారులు నలుగురు మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి మణుగూరులోని బాలల సదనానికి తరలించారు. ఐదు రోజులుగా అక్కడే ఉంటున్న బాలికలు ఇద్దరు.. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడం గమనార్హం.


