పన్నెండు కిలోమీటర్ల మహా పాదయాత్ర
కాకతీయ, రామకృష్ణాపూర్ : లోక కళ్యాణార్థం,ధనుర్మాసం సందర్భంగా మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పన్నెండు కిలోమీటర్ల మహా పాదయాత్ర విజయవంతం అయ్యింది. స్థానిక హమాలివాడ భక్తాంజనేయ దేవస్థానం నుంచి గద్దె రాగడి మీదుగా బొక్కల గుట్ట ఋష్యముఖ పర్వతం వరకు కాలినడక ద్వారా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు. గోహత్యను నివారించి,జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.


