ఫోన్ టాపింగ్‌లో టీవీ 5 సీఈవో మూర్తి !
కేసు నమోదుచేసిన కూకట్‌పల్లి పోలీసులు
ఆయనతోపాటు గౌతమి చౌదరిపైనా..
రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీనియర్ జర్నలిస్టు, టీవీ5 న్యూస్ చానల్ సీఈవో మూర్తిపై ఫోన్ టాపింగ్ ఆరోపణలతో కేసు నమోదైంది. రూ10 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలతోపాటు, వ్యక్తిగత గోప్యత, ప్రైవసీని భంగం కలిగిచే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలతో హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీసులు మూర్తితోపాటు గౌతమి చౌదరిపై కేసు నమోదుచేయడం రాజకీయ, మీడియా వర్గాల్లో కలకలంరేపింది. హైకోర్ట్ న్యాయవాది నాగూర్ బాబు, హీరో ధర్మ మహేష్ తరుపున వాదనలు వినిపించి టీవీ5 మూర్తి, గౌతమీ చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ కి తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్ట్ కూకట్‌పల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి మూర్తితోపాటు గౌతమీ చౌదరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో టీవీ5 మూర్తి , గౌతమి చౌదరిపై పోలీసులు 308 (3) BNS 72 IT Act ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


