సౌండ్ పెంచండి… ట్రెండింగ్‌లో కేసీఆర్ వీడియో
సర్పంచ్ ఎన్నికల్లో పాజిటివ్ వైబ్రేషన్.. రేవంత్‌ను టార్గెట్ చేస్తూ..
Revanth is Telangana's 1st CM to campaign in Sarpanch Elections…
After seeing BRS win 1345 Sarpanchs in 1st phase CM Revanth decides to increase his campaign.
CM Revanth to hold 18 public meetings for 2nd phase ❗️– 𝐁𝐚𝐥𝐚𝐦𝐚𝐥𝐚𝐧𝐧𝐚 𝐣𝐚𝐫𝐚𝐚 𝐒𝐨𝐮𝐧𝐝 𝐩𝐞𝐧𝐜𝐡𝐮 pic.twitter.com/avSvnMyQfX
— Dr.Krishank (@Krishank_BRS) December 12, 2025
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కేసీఆర్ స్పీచ్..మాటలతో వదిలిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1345 స్థానాలను దక్కించుకుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని సర్పంచ్ ఎన్నికల్లో సైతం ప్రచారం చేసినా ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాలేదని, అధికారంలో లేకపోయినా.. స్థానిక సంస్థల్లో ప్రజలు బీఆర్ ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని పేర్కొంటూ సోషల్ మీడియాలో పేర్కొంటోంది. ఇదిలా ఉండగా.. కేసీఆర్ వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవంలోని మాటలను వీడియోలు.. పాటలతో మిక్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. కేసీఆర్ మాటలు ప్రత్యక్షంగా వినకపోయినా… ఇప్పుడు ఈ వీడియోలతో బీఆర్ ఎస్ సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది.


