చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
కాకతీయ, హైదరాబాద్ : చిన్నారిపై ట్యూషన్ టీచర్ రాక్షసత్వం ప్రదర్శించిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా చదవడం లేదని ఆగ్రహించిన టీచర్ ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చింది. ఈ సంఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ స్థానికంగా ట్యూషన్ చెప్పే మానస వద్దకు వెళ్తున్నాడు. అయితే ట్యూషన్ లో చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖం పై టీచర్ మానస వాతలు పెట్టింది. అట్లకాడతో తేజనందన్ శరీరం పై 8 చోట్ల కాల్చినట్లు తల్లిదండ్రులు చెబున్నారు. ఈమేరకు టీచర్‌పై తేజనందన్ తల్లిదండ్రులు ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


