epaper
Monday, March 2, 2026
epaper

భారతీయులకు షాక్.. H1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చేస్తున్నారు. సెప్టెంబర్ 19న వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన H-1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త ఫీజులు ప్రకటించారు.ఇప్పటి వరకు H-1B వీసాకు నార్మల్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి అప్లికేషన్‌కు $1 లక్ష (దాదాపు ₹84 లక్షలు) ఫీజు విధించారు. మూడేళ్ల గడువులో మొత్తంగా $3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికాలో హై-స్కిల్డ్ జాబ్స్‌ను తీసుకోవడానికి భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

అమెరికా టెక్ దిగ్గజాలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటివి ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయి. ఉదాహరణకు, 2025లో మొదటి అర్ధ సంవత్సరంలోనే అమెజాన్ 12,000 H-1B వీసాలు, మైక్రోసాఫ్ట్, మెటా తలో 5,000కి పైగా వీసాలు పొందాయి. కొత్త ఫీజులు కంపెనీల ఖర్చును గణనీయంగా పెంచుతాయి. దీంతో, వీరు స్థానిక అమెరికన్ గ్రాడ్యుయేట్స్‌ను తీసుకునే అవకాశమూ ఉంది.

అదే సమయంలో, ట్రంప్ మరో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. ట్రంప్ గోల్డ్ కార్డ్. ఇది అల్ట్రా-రిచ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కోసం రూపొందించిన స్కీమ్. $10 లక్షల (సుమారు ₹8.4 కోట్లు) చెల్లిస్తే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ, వర్క్ అథరైజేషన్, పౌరసత్వానికి దారి లభిస్తుంది. కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ తీసుకుంటే ఈ ఫీజు $20 లక్షలు. ప్లాటినం వెర్షన్ $50 లక్షలతో లభిస్తుంది, దానిలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఈ స్కీమ్, ప్రస్తుతం ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాను రీప్లేస్ చేస్తుంది.ట్రంప్ అంచనా ప్రకారం, గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా $100 బిలియన్ రెవెన్యూ వస్తుందని భావిస్తున్నారు. దీన్ని ట్యాక్స్ కట్స్, డెబ్ట్ రిడక్షన్ కోసం ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కానీ, ఈ విధానం భారతీయ ఐటీ రంగంపై భారీ ఒత్తిడిని సృష్టించనుంది. ప్రస్తుతం 4 లక్షలకుపైగా భారతీయులు H-1B వీసాలపై ఆధారపడి ఉన్నారు. NASSCOM ప్రకారం, కొత్త ఫీజులు కంపెనీలను ఔట్‌ సోర్సింగ్ తగ్గించడానికి దారితీస్తాయి. దీని వల్ల జాబ్ లాసెస్ పెరగొచ్చని భయం వ్యక్తమవుతోంది. కాగా అమెరికా కాంగ్రెస్‌లో ఈ నిర్ణయాలపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. డెమోక్రాట్లు దీనిని “వెల్తీ ఫేవరింగ్ పాలసీ”గా విమర్శిస్తుండగా, రిపబ్లికన్లు ఎకనామిక్ బూస్ట్ గా సమర్థిస్తున్నారు. కానీ భారతీయ టెక్ టాలెంట్ కోసం ఇది పెద్ద సవాలుగా మారింది. దీంతో విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఇప్పుడు కెనడా, యూరప్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ట్రంప్ ఈ చర్యలతో అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. అయితే గ్లోబల్ టాలెంట్ పూల్‌పై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img