కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆఅవిర్భావం కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే జరిగిందని, ఆయన చరిత్ర ప్రజా పోరాటాలతో నిండిపోయిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రమణా రెడ్డి మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాపూజీ సేవలను గుర్తించి ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి, హార్టికల్చర్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టి గౌరవించారని తెలిపారు. భావితరాల యువత ఆయన పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకొని ప్రజల కోసం పని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ ఎలగొండ రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్ అడ్డగట్ల శ్రీధర్, గొర్లవీడు సీనియర్ నాయకుడు నరసయ్య, పద్మశాలి కుల పెద్దలు గండ్ర రమణా రెడ్డికి శాలువ కప్పి సన్మానించారు. భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


