ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు..
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు ప్రకటించారు. గురువారం కే టి పి పి ప్రధాన ద్వారం వద్ద జరుగుతున్న సమ్మెలో పాల్గొని కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఏ పి ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యార్హతలకు అనుగుణంగా పదోన్నతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.


