పాల్వంచలో సమస్యల తిష్ట
డ్రైనేజీలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేతల వినతి పత్రం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పాల్వంచ మండలకేంద్రంలో రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించాలని బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో డ్రైనేజీల్లో చెత్త, చెదారం, మురుగునీరు పేరుకుపోయి దుర్గంధంగా తయారయ్యాయని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు బుధవారం పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల బీఆర్ఎస్ నాయకులు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి ల ఆధ్వర్యంలో ఎంపీడీవో ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా బీఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని 36 గ్రామపంచాయతీలలో రోడ్లు మొత్తం గుంటల మాయంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, తోట ప్రవీణ్, పోసారపు అరుణ్ కుమార్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్,దాసరి సురేష్, నడిగట్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


