కాకతీయ, రామకృష్ణాపూర్ : సీపీఐ నేత కామ్రేడ్ గుండా మల్లేష్ ఐదో వర్ధంతిని పట్టణ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ నాయకులతో కలిసి మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం, కార్మిక హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పౌలు, సాంబయ్య, నాయకులు శంకర్, కొమురయ్య, రాజన్న, రమేష్, గురువయ్య, చందర్ పాల్గొన్నారు.


