నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం
కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కటుకూరి రాధిక శ్రీనివాస్‌ను ఆదివారం గణపురం గ్రామ మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయ సహకారాలతో అన్ని విధాలా తోడ్పాటు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనపురం మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బోట్ల శ్రీనివాస్ పటేల్, మండల అధ్యక్షుడు పుప్పాల దీపక్ పటేల్‌తో పాటు ఆవుల రవి కిరణ్ పటేల్, చెలుమల్ల డా. సంపత్ పటేల్, కోవ్వూరి శ్రీనివాస్ పటేల్, చెరుకు నర్సింగం పటేల్, సిరంగి రాజేశ్వరరావు పటేల్, సిరంగి సుదయ్య పటేల్, తోట రవి పటేల్, కొవ్వూరు మహేందర్ పటేల్, బోట్ల రాజు పటేల్, విడిదినేని శంకర్ పటేల్, తోట నవీన్ కుమార్ పటేల్, సుంకరి రమేష్ పటేల్, పత్తేం రాజు పటేల్, పత్తేం ప్రభాకర్ పటేల్, పత్తేం శివ పటేల్, సిరంగి భద్రయ్య పటేల్, మిడిపెల్లి బాబురావు పటేల్, దేవ గణేష్ పటేల్, చింతనిప్పుల సంపత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధారం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ విడిదినేని కవిత అశోక్ పటేల్ కూడా పాల్గొన్నారు.


