epaper
Wednesday, March 11, 2026
epaper

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌
వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది
సామాజిక న్యాయం అమలులో తెలంగాణ ముందుంది
ఎస్టీ నేతలకు కాంగ్రెస్‌లో కీలక పదవులు ఇవ్వనున్నాం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ఇందిరా భవన్‌లో ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

కాక‌తీయ‌, గాంధీ భవన్ : ఇందిరా భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ ఎమ్మెల్యే విక్రాంత్ బూర్య, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో పాటు ఆదివాసి ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి డీసీసీ నియామకాలలో పెద్దపీట వేశామని తెలిపారు. అందులో భాగంగా ఎస్టీ వర్గానికి చెందిన ఐదుగురు నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజార్టీగా డైరెక్టర్ పదవులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ హక్కులు మరియు భూమి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లంబాడీలు ఎక్కువగా ఉన్న తన స్వగ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం పదకొండు ఎకరాల భూమిని ఇచ్చానని తెలిపారు. చదువుకుంటే జీవితం రంగులమయం అవుతుందని, ఆదివాసి యువత విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద సంఖ్యలో గెలిచారని అన్నారు. దేశ ప్రజల సంరక్షణ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసిన మహనీయురాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. స‌మావేశానికి ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ బూర్య, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క, ఆదివాసి ఎంపీలు, ఎమ్మెల్యేలు,త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

 

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల...

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్...

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్‌,...

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img