గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి
యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్
కాకతీయ, కొత్తగూడెం : గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో కూడా ఉన్నత స్థానాలను చేరాలని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ సూచించారు. కష్టపడి ముందుకు సాగితే ఉన్నత పదవులు సాధించడం సాధ్యమని తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కార్పొరేట్ రంగంలో కీలక స్థానాలు దక్కించుకోవాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా రిలయన్స్ జియో ప్రాజెక్ట్ మేనేజర్‌గా సేవలందించిన భూక్య శేఖర్ పదోన్నతిపై గుజరాత్ జాంనగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వెళ్తుండటంతో ఆయనను ఘనంగా సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తో కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎదగడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ జిల్లా కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జర్పుల ఉపేందర్, లావుడియా హరిలాల్, వంశీ, రమేష్ నాయక్, సాంబ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


