కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని రైతు సహకార సంఘం కోపరేటివ్ బ్యాంకులో భారీగా అవకతోకలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనట్టు సమాచారం. నాబార్డ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి అధిక ఖర్చులు చేయడం ఆడిట్ రిపోర్టులోని చూపిన లోపాలను సరి చేయకపోవడం వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం వంటి అంశాలు తీవ్ర లోపాలుగా గుర్తించినట్లు సమాచారం.
కమిటీ సభ్యులలోని డిఫాల్టర్లు ఉండటం, సహకార సంఘంలో అవినీతి ఎంత లోతుగా ఉందో బహిర్గతం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. సొసైటీలో రైతుల పేరుతో భారీ గా అక్రమాలకు సొసైటీ చైర్మన్ తెరలేపారని స్థానికుల అధికారుల నుంచి సమాచారం ద్వారా తెలుస్తోంది. వాటిలో సహకార సంఘ రైతులకు 89 లక్షలు బకాయిలను రికవరీ చేయకపోవడం, 2021 -22, 23 -24 సంవత్సరంలో వార్షిక బడ్జెట్లో.
వార్షిక బడ్జెట్ సిద్ధం చేసి ఆమోదంపై చేయడంలో విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయని సమాచారం. దీనిపై జిల్లా సహకార సంఘం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవలసి ఉన్న రాజకీయ ఒత్తిళ్ళతో సంఘములో జరిగే అవకతవకలను కప్పిపుచ్చినట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానికులు ఎన్నిసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అపవాదు నెలకొని ఉంది.
సొసైటీ లో 8.39 కోట్ల కు పైగా ఉన్న పాత ,మొండి బకాయిలు రికవరి చేయక పోవడం, వీటి కారణంగా సొసైటీ చైర్మన్ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దుచేసి వారి స్థానంలో, ప్రత్యేక పాలన అధికారి కె. రమేష్ ను నియమించినట్లు సమాచారం. దీనిపై జిల్లా డి సి ఓ వెంకటేశ్వరరావును వివరణ కోరగా తోరూరు సహకార సంఘంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, పాలకవర్గాన్ని రద్దుచేసి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు.


