పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలిఎస్సై గోవర్ధన్
కాకతీయ, నల్ల బెల్లి: మండలంలో ఉద్రిక్తంగా పెరుగుతున్న పొగమంచు పరిస్థితుల దృష్ట్యా పౌరులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి ఎస్సై వి. గోవర్ధన్ సూచించారు. ఉదయపు వేళల్లో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో ప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉండటంతో అత్యవసరమైతేనేగాని ఉదయం 8 గంటల లోపు ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు.
వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్‌లో ఉంచడం, వేగం తగ్గించడం, ముందున్న వాహనంతో తగిన దూరం పాటించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిలో ప్రయాణించే వారు నియమాలు కచ్చితంగా పాటించాలని ఎస్సై తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు.


