9 మంది ఎస్సైల బదిలీ
భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫర్స్
డీఐజీ కార్యాలయం ఉత్తర్వులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 9 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు కాళేశ్వరం జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మంగళవారం ఉత్తర్వులు జారీ కాగా, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులను వెంటనే కొత్త స్థానాల్లో విధులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బదిలీ అయిన అధికారులు..
బి. అశోక్ మొగుళ్లపల్లి ఎస్‌హెచ్‌వో నుంచి ఘనపూర్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ కాగా, డి. సుధాకర్ టేకుమట్ల ఎస్‌హెచ్‌వో నుంచి రేగొండ ఎస్‌హెచ్‌వోగా, జి. శ్రవణ్ కుమార్ చిట్యాల ఎస్‌హెచ్‌వో నుంచి భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ-2గా, ఎస్. సాయి త్రిలోకనాథ్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి కొతపల్లి గోరి ఎస్‌హెచ్‌వోగా, పి. సతీష్ జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి చిట్యాల ఎస్‌హెచ్‌వోగా, ఎం. సురేష్ ములుగు జిల్లా వీఆర్ నుంచి మొగుళ్లపల్లి ఎస్‌హెచ్‌వోగా, జి. అమూల్య జయశంకర్ భూపాలపల్లి వీఆర్ నుంచి టేకుమట్ల ఎస్‌హెచ్‌వోగా, ఆర్. అశోక్ ఘనపూర్ (ఎం) ఎస్‌హెచ్‌వో నుంచి జయశంకర్ భూపాలపల్లి వీఆర్‌కు, ఎస్. దివ్య కొతపల్లి గోరి ఎస్‌హెచ్‌వో నుంచి జయశంకర్ భూపాలపల్లి వీఆర్‌లకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లకు డీఐజీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా సంబంధిత విభాగాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.


