సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ
కాకతీయ, నెల్లికుదురు: రంగారెడ్డి జిల్లా సెంటర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ శిక్షణల ఆధారంగా మండలంలోని టీజీఎంఎస్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రావు తోటి ఉపాధ్యాయుల సహకారంతో సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అంజుం సుల్తానా 6వ తరగతి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీడ్ బాల్స్‌ను చెట్లు లేని ప్రాంతాల్లో వేయడం ద్వారా తెలంగాణలో అడవి విస్తీర్ణం పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.


