కాకతీయ, తెలంగాణ బ్యూరో: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ తనయుడు జయక్రిష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మజ మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2025
మావయ్య నందమూరి జయక్రిష్ణ సతీమని పద్మజ అత్తమరణించారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబానికి అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మరణం మా కుటుంబానికి తీరని లోటు అని మంత్రి నారాలోకేశ్ ట్వీట్ చేశారు.


