కాకతీయ , బయ్యారం: నీటి గండం, విహారం పేరిట ఆ కుటుంబంలో విషాదం మిగుల్చాయి. తొమ్మిదేళ్ల క్రితం పెద్ద కుమారుడు వాగులో కొట్టుకుపోయి మరణించగా.. చేతికి అంది వచ్చిన రెండవ కుమారుడు జలగుండంలో చిక్కుకొని మరణించడంతో తల్లిదండ్రులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతం వద్ద చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా వైరా మండలం జెన్నారం గ్రామానికి చెందిన పామర్తి శ్రీను, లక్ష్మి దంపతుల రెండవ కుమారుడు పామర్తి ప్రేమ్ కుమార్ (23) తన స్నేహితులతో కలిసి ఏడు బావుల జలపాతానికి విహారయాత్రకు వ చ్చాడు. ఈ క్రమంలో రాళ్లపై ఎక్కి ఫొటోలు దిగే క్రమంలో ఒక్కసారిగా జారి జలపా తంలో పడి ఏదో, బావిలోకి జారిపోయాడు. మిత్రుడను చూసే సరికి నీటిలో పడి బయటి రావటం లేదు.
కంగారుతో వెంటనే గంగారం పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే రాత్రి అవటంతో గాలింపు కష్టత రంగా మారి మిత్రులు శనివారం గ్రామంలోని ఠాణాకు వచ్చారు. ఎస్ ఐ రవికుమార్ ఆదివారం ఉదయాన్నే రెస్క్యూటీమ్ తో గాలించి మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి ఇల్లందు పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ తెలి పారు. కాగా ఇదే కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం పెద్ద కుమారుడు కూడా వాగులో పడి మృతి చెందాడు. ఇప్పుడు రెండవ కుమారు డిని కూడా ఇలాగే కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.


