- డీజే ట్రాలీ కిందపడి బాలుడి మృతి
- కేసు నమోదు చేసిన ఎస్ఐ
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామంలో దసరా పండగ నాడు గురువారం దుర్గమ్మ వేడుకల్లో డీజే ట్రాలీ కిందపడి జశ్వంత్ (5) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే వద్ద డాన్స్ చేస్తున్నప్పుడు ట్రాలీ కింద బాలుగు పడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాలుడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో అతడిని మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై గూడూరు ఎస్ఐ గిరిధర్ రావు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


