కాకతీయ, హనుమకొండ : హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వైద్య ఖర్చులు అధికమవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి పిలుపునకు స్పందించిన ట్రాఫిక్ సిబ్బంది తమ వంతు సహకారంగా రూ. 72 వేల రూపాయలు సమకూర్చారు.
ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మార్చి పత్రాలను ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ చేతుల మీదుగా శ్రీనివాస్ పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ, సహోద్యోగుల సహకారాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సీతారెడ్డి, ఎస్‌ఐలు కొమురెల్లి, ఫసిద్దీన్, విజయ్‌కుమార్‌తో పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


