కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఉర్సు రంగాలీల మైదానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈనెల రెండు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడవ తేది ఉదయం ఐదు గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
- వాహనాల రూట్ మళ్లింపులివే..
ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళే భారీ వాహనాలు ఫున్నెలు క్రాస్ – ఐనవోలు, ఆర్చ్ – వెంకటాపురం – కరుణాపురం మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్ళే వాహనాలు కొత్తపేట – ఎనుమముల – లేబర్ కాలనీ – తెలంగాణ జంక్షన్ – ఫోర్ట్ రోడ్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే వాహనాలు కరుణాపురం – వెంకటాపురం – ఐనవోలు – ఫున్నెలు క్రాస్ మార్గం ద్వారా ప్రయాణించాలి అని సీపీ తెలిపారు.
- ఇక్కడే పార్కింగ్ చేయాలి..
హన్మకొండ హంటర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు.. కొలంబో హాస్పిటల్, బీఆర్ నగర్ ఎదురుగా గానుగ ఆయిల్ పాయింట్, ఆకుతోట ఫంక్షన్ హాల్, నాని గార్డెన్, జె ఎస్ ఎం స్కూల్ వద్ద. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర. ఆర్ టి ఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కాలేజ్ దగ్గర. కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు భీరన్న గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలని సీపీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ సౌకర్యాలను ఉపయోగించి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


