epaper
Tuesday, March 3, 2026
epaper

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు
▪️ 18న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు మళ్లింపులు
▪️ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో అమల్లోకి నిబంధనలు
▪️ భారీ వాహనాలకు హోల్డింగ్ పాయింట్లు
▪️ నగర ప్రజలు అవసరం లేకపోతే రోడ్లపైకి రావొద్దు
▪️ హైదరాబాద్–భద్రాచలం రూట్లలో మార్పులు
▪️ ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరి

కాకతీయ, ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో ఈ నెల 18వ తేదీన ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశించకుండా ముందుగానే హోల్డింగ్ పాయింట్లలో నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా నగరంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసర అవసరం ఉంటే తప్ప ప్రజలు వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు

ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే కార్లు, చిన్న వాహనాలు రాజమండ్రి–దేవరపల్లి–జంగారెడ్డిగూడెం–అశ్వరావుపేట–సత్తుపల్లి–భద్రాచలం–కొత్తగూడెం–మణుగూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కల్లూరు, వైరా సోమవరం గ్రామాల వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి, కోదుమూరు వద్ద దిగి అల్లిపురం–బోనకల్ రోడ్డు మీదుగా ధంసలపురం బ్రిడ్జి వద్ద మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కొత్తగూడెం వైపు వెళ్లే కార్లు, చిన్న వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద దిగి, ప్రకాష్ నగర్–చర్చి కాంపౌండ్–ముస్తఫానగర్–అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే చేరుకోవాలని సూచించారు. సత్తుపల్లి, అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తరువాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకొని డోర్నకల్–మహబూబాబాద్ మార్గంలో వరంగల్ చేరుకోవాలని తెలిపారు. ఇల్లందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ నుంచి ఎస్ఆర్ గార్డెన్, గోపాలపురం, గొల్లగూడెం మీదుగా లకారం చేరుకొని నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం వైపు వచ్చే కార్లు, చిన్న వాహనాలు ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్, నాయుడుపేట, గాంధీ చౌక్, చర్చి కాంపౌండ్, ముస్తఫానగర్, అల్లిపురం మీదుగా కోదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించడం ద్వారా ఇబ్బందులు తప్పించుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img