ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ హఠాన్మరణం
డ్యూటీ ముగించుకున్న కొద్దిసేపటికే మృతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ గాంధీ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ దేవేందర్ హఠాన్మరణం చెందారు.ప్రతిరోజులాగే ఉదయం డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న ఆయనకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.దేవేందర్ మరణ వార్త తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధుల్లో నిబద్ధతగా పనిచేసే అధికారుల్లో దేవేందర్ ఒకరని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి.


