కాకతీయ, నూగూరు వెంకటాపురం: మండల పరిధిలో గల చొక్కాల గోదావరి పరిసర ప్రాంతాల్లో నుండి సోమవారం జెసిబి సహాయంతో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు చాకచక్యంగా వాటిని పట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ విషయంపై డిప్యూటీ తహసిల్దార్ మహేందర్ ను వివరాలు కోరగా ఒక జెసిబి, ఆరు ట్రాక్టర్లను సీజ్ చేశామని తెలిపారు. ఇసుక రవాణా కంకల వాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు తరలిస్తున్నారని, ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. వాటిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని చెప్పారు.


