నల్లబ్యాడ్జీలతో టీపీటీఎఫ్ నిరసన
పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, తొర్రూరు : ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమవుతున్నారని టిపిటిఎఫ్ మండల అధ్యక్షుడు కొండ జనార్ధన్ తీవ్రంగా విమర్శించారు. ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కట్టేపాలం పాఠశాలలో టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, ఉపాధ్యాయులపై జరుగుతున్న మోసపూరిత విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు తండ ప్రభాకర్‌తో పాటు ఉపాధ్యాయులు, టిపిటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


