కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఈనెల 23న గాంధీభవన్ లో టీపీసీసీ విస్త్రుత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈనెల 23న జరగనున్న సమావేశంలో బిసి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ అంశలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ఈనెల 23న టీపీసీసీ పీఏసీ విస్తృత సమావేశం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


