కాకతీయ, ములుగు: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు ఆలయ శిల్పకళలను ఆస్వాదించారు.
ఉదయం మొదలు సాయంత్రం వరకు వందలాది మంది పర్యాటకులు రామప్ప చెరువు తీరాన్ని, రామలింగేశ్వర ఆలయం పరిసరాలను సందర్శించారు. ఆలయ గోపురం, గర్భగృహంలోని శిల్పాలు, నర్తకుల ప్రతిమలు చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు.


