- విద్యార్థులకు బహుమతులు అందజేసిన కలెక్టర్
కాకతీయ, ఆదిలాబాద్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పర్యాటకంపై ఆసక్తి పెంపొందించేందుకు సెప్టెంబరు 19న జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, డ్రాయింగ్, ఉపోద్ఘాతం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటకం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి సౌందర్యం, జలపాతాలు, గిరిజన సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, గైడ్ లింగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


