మావోయిస్టు అగ్ర నేత గణేశ్ ఉయికే హతం
ఓడిషా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో ఎన్‌కౌంటర్
మరో ముగ్గురు మావోయిస్టులు మృతి
గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా పుల్లెమల గ్రామం
ఆయన తలపై రూ.1.10 కోట్ల బహుమతి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఓడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో టాప్ మావోయిస్టు నాయకుడు గణేశ్ ఉయికే హతమయ్యాడు. ఆయన తలపై రూ.1.10 కోట్ల బహుమతి ఉండగా, భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మొత్తం నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉయికే (69)కు పక్కా హనుమంతు, రాజేష్ తివారీ, చంరు, రూప అనే అలియాస్‌లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా, చేందూర్ మండలం పుల్లెమల గ్రామం. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మిగతా ముగ్గురు మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


