మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ!
సుపరిపాలనతోనే అమరవీరులకు నిజమైన నివాళి
పెగడపెల్లిలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
కాకతీయ, హన్మకొండ: కుల–మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా జరుపుకునే పండుగలు జాతీయ పండుగలేనని, ఆగస్టు 15, జనవరి 26 రోజులు భారత ఏకత్వానికి ప్రతీకలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు మార్తినేని ధర్మారావు పేర్కొన్నారు. హన్మకొండ 54వ డివిజన్ పరిధిలోని పెగడపెల్లి డబ్బాల్ సెంటర్‌లో బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని అన్నారు. రాజ్యాంగం బడుగు, బలహీన వర్గాల జీవితాలను మెరుగుపరచడానికేనని, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు దేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తోందని తెలిపారు. స్వయం పరిపాలనను సుపరిపాలన దిశగా నడిపించడమే అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ బీజేపీ నాయకులు చీకటి సతీష్, చల్లూరి రాజు, వివేక్, రాము, వీరాచారి, వెంకన్న, గండ్రతి కుమారస్వామి, జ్యోతి, భాగ్యమ్మ, లావణ్య, రజిత, ఈశ్వర, క్రాంతి పాల్గొన్నారు. అలాగే డివిజన్ పెద్దలు తిరుపతి రెడ్డి, అశోక్, రంగారెడ్డి, నాగవల్లి కృష్ణ, పోతర్ల రాజారాం, అబ్బరబోయిన సురేందర్, సురేష్, యాకయ్య, సతీష్ తదితరులు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు.


