epaper
Sunday, March 1, 2026
epaper

నేడే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సమరం

నేడే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సమరం
ప్రోగ్రెసివ్–మన ప్యానెల్ మధ్య హోరాహోరీ
అగ్ర నిర్మాతల మద్దతుతో రంగంలో రెండు వర్గాలు
చిన్న–పెద్ద నిర్మాతల మధ్య భావజాల పోరు

కాక‌తీయ‌, హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025–27 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో విభాగాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, డి. సురేశ్ బాబు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక విధానాలు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ వర్గం ప్రకటిస్తోంది. ఈసారి ఎగ్జిబిటర్ల వంతు కావడంతో అధ్యక్ష పదవికి డి. సురేశ్ బాబు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మన ప్యానెల్ వ్యూహం

మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, తుమ్మల ప్రసన్న కుమార్, నట్టి కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. చిన్న నిర్మాతలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతూ, థియేటర్ల కేటాయింపులో సమానత్వం, చిన్న సినిమాలకు ఐదో షో అవకాశం వంటి హామీలతో ప్రచారం సాగిస్తున్నారు. పరిశ్రమ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఈ వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుపై సి. కళ్యాణ్, నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రతిగా పరిశ్రమ మనుగడకు ఐక్యత అవసరమని, వ్యక్తిగత ఆరోపణలు తగవని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నేతలు స్పష్టం చేస్తున్నారు. నాలుగు కీలక విభాగాలకు సంబంధించిన ప్రతినిధుల ఎన్నికలతో పాటు ఛాంబర్ భవిష్యత్ దిశను ఈ ఫలితాలు నిర్దేశించనున్న నేపథ్యంలో, టాలీవుడ్ వర్గాలు ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img