గ్రామ అభివృద్ధికి సహకరించాలి
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ బానోత్ రేణుక నరేష్ నాయక్
కాకతీయ, ఇనుగుర్తి: గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని దానికి గ్రామ నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని సర్పంచ్ బానోత్ రేణుక నరేష్ నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద తండా (సీఎం) గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన ఐదు లక్షల నిధులతో బొడ్రాయి నుంచి బానోత్ బాలు ఇంటి వరకు సిసి రోడ్డును గ్రామ నాయకులతోపాటు సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తాము గ్రామంలోని నాయకులందరినీ సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ రాజు నాయక్, భిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ లచ్చిరాం, చిన్నముప్పార బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కారుపోతుల సుధాకర్ గౌడ్,గ్రామ వార్డ్ మెంబర్లు లక్ష్మి లచ్చిరాం నాయక్,సంతోష్ నాయక్, శోభా శంకర్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


