టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ
కాకతీయ, కరీంనగర్: స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చాంబర్‌లో తెలంగాణ ఎన్జీవోల సంఘం, కరీంనగర్ జిల్లా డైరీ–2026ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎన్జీవోల సంఘం రూపొందించిన డైరీలో ఉద్యోగులకు ఉపయోగపడేలా మీడియా, ప్రెస్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ఉద్యోగులకు అవసరమైన కీలక జీవోలు, జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపు వివరాలను పొందుపరచడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, సహఅధ్యక్షులు ఓణటెల రవీందర్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, పట్టణ కార్యదర్శి వెలిచాల సుమంతరావు, రూరల్ అధ్యక్షుడు కోడూరి వాస్తవిక్ గౌడ్, రూరల్ కార్యదర్శి కొమ్మర శ్రీనివాస్ రెడ్డి, తిమ్మాపూర్ అధ్యక్షుడు పోలు కిషన్, కార్యదర్శి అంబటి నాగరాజు, జిల్లా నాయకులు శారద, సబితా, హరిప్రియ, సుస్మిత, సరిత, శైలజ, స్వర్ణలత, సూర్యకామ, సతీష్ బాస, పవన్ కుమార్, హర్మీందర్ సింగ్, ఎండి అస్గర్ అలీ, కరుణాకర్, వెంకటరెడ్డి, దొంత రాజు, తాళ్ల నారాయణ, రాజేష్, ఎడ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


