సకాలంలో ‘సుపారీ యత్నం’ భగ్నం
ముగ్గురు నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లాలో గన్ కల్చర్ కలకలం రేపింది. ములుగు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ వద్ద ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఈ ముగ్గురు యువకులు గన్‌తో బెదిరించగా సమాచారం. అందుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిలో సూరి (సురేందర్) అనే వ్యక్తి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారానికి చెందినవాడిగా గుర్తించారు. హైదరాబాద్‌లో 40కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న సూరి, తన బృందంతో భూపాలపల్లిలో సుపారీ హత్యకు యత్నించగా ములుగులో పోలీసుల వలలో చిక్కినట్టు సమాచారం. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ విచారణ కొనసాగుతోంది. విచారణలో మరిన్ని షాకింగ్ వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.


