epaper
Monday, March 2, 2026
epaper

పంచాయ‌తీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

పంచాయ‌తీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
నిరంతర నిఘాతో ప్రశాంత పోలింగ్‌కు సిద్ధం
క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం

కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అశాంతి లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలతో కలిసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, ఫీల్డ్ స్టాఫ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 19 శాతం కేంద్రాలను స‌మ‌స్యాత్మ‌క కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఈ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో స్టాటిక్ పార్టీ విధులు నిర్వర్తించనుండగా, మార్గాల్లో రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల రోజున సంభవించే అత్యవసర పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రతి మండలానికి ఏసీపీ స్థాయి అధికారిని బాధ్యతలో పెట్టి, వారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. కమిషనరేట్‌ను 104 క్లస్టర్లుగా విభజించి, ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను కేటాయించామ‌న్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సాధారణ రాత్రి గస్తీతో పాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో అదనపు గస్తీ బృందాలు పనిచేయనున్నాయ‌న్నారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై బైండోవర్‌లు పూర్తి చేసి, వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అశాంతి లేకుండా విజయవంతంగా జరగడానికి ప్రజలు మరియు రాజకీయ పార్టీ ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img