కాకతీయ, వరంగల్ సిటీ: గ్రేటర్ వరంగల్ లోని వినాయక నిమజ్జనం ఏర్పాట్ల కొరకు బల్దియా పరిధిలోని బెస్థం చెరువు, ఉర్సు చెరువు, బంధం చెరువు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా బల్దియా తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రాష్ కలెక్టర్ యంత్రం ద్వారా చెరువుల్లో కొనసాగుతున్న పూడిక తీత గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించారు.
ఇరిగేషన్ సిబంది సహకారంతో పగడ్బందీ గా ఏర్పాట్లు చేయాలన్నారు. బల్దియా ద్వారా రహదారులపై గ్రావెల్, తగినంత లైటింగ్, శానిటేషన్ లో భాగంగా ఎప్పటికపుడు నిమజ్జన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన, మరుపల్ల రవి, సీఎంహెచ్ ఓ డా.రాజారెడ్డి, డీఎఫ్ ఓ శంకర్ లింగం, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఇరిగేషన్ ఈ ఈ శంకర్, బల్దియా ఈ ఈ లు సంతోష్ బాబు, మాధవి లత, డీఈలు రవికిరణ్, సతీష్, రాగి శ్రీకాంత్, ఇరిగేషన్ డీ ఈ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


