- కాంగ్రెస్ ఓబీసీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు హరికృష్ణ
కాకతీయ, ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడుమరద హరికృష్ణ గౌడ్ అన్నారు. ఎలక్షన్ల కోసం షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కోరే వారి నుండి శనివారం దరఖాస్తులు స్వీకరించగా హరికృష్ణ చిన్ననాగారం ఎంపీటీసీ కోసం ఇనుగుర్తి లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కూరెల్లి సతీష్ తో కూడిన బృందానికి దరఖాస్తు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గత స్థానిక ఎన్నికలలో పార్టీ వ్యతిరేకులకు మద్దతు తెలిపి కాంగ్రెస్ ఓటమికి కారకులైన వారికి టికెట్లు ఇవ్వవద్దని సూచించారు.


