మూడు కేజీల గంజాయి స్వాధీనం
గిర్నీబావి వద్ద తనిఖీల్లో పట్టివేత
ఇద్దరి అరెస్ట్, ఆటో సీజ్.. రెండు మొబైల్ ఫోన్ల స్వాధీనం
కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని గిర్నీబావి ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మూడు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఆటోతో పాటు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం గిర్నీబావి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు నిలిపివేసి విచారించారు. అనంతరం ఆటోను తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న మూడు కేజీల గంజాయి గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.
గంజాయితో పాటు నిందితుల వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.


