కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు మరణించగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఈ ప్రమాదం జరిగింది. అటు అంబర్ పేట్ లో రామ్ చరణ్ అనే యువకుడు కూడా ఇలాగే విగ్రహం తరలిస్తుండగా..అడ్డు వచ్చిన తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించాడు.
ఆదివారం రాత్రి రామంతాపూర్ క్రిష్ణాష్టమి వేడుకల్లో విద్యుత్ ఘాతానికి గురై ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో మూడు విద్యుత్ షాక్ ఘటనలు జరగడం ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.


