క్రీడా పోటీల పరిశీలకుడిగా తోట సురేష్
కాకతీయ, నర్సింహులపేట : తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర కబడ్డీ క్రీడోత్సవాల పరిశీలకునిగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన తోట సురేష్ నియామకమయ్యారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5నుండి7వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగే క్రీడోత్సవాలకు పరిశీలకునిగా ప్రకటించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ నియామకానికి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాసాని వీరేష్ ముదిరాజ్,మహేందర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.


