చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…
కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలంలోని చెన్నారం గ్రామంలో ఈత చెట్లను తొలగించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని గౌడ సంఘం కులస్తులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నాయకుడు గట్టు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం వర్థన్నపేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎక్సైజ్ శాఖ దుండగలను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005లో అప్పటి ప్రభుత్వం 2 ఎకరాల భూమి ఇచ్చి గౌడ సంఘానికి అండగా నిలిచిందని,చెట్లను నరికి గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని వాపోయారు. ఈ ఘటనకు కారణమైన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.


