కల్పన ఆత్మహత్యాయత్న బాధ్యులను శిక్షించాలి
మహిళా సిబ్బందిని స్వేచ్ఛగా పని చేయానివ్వాలి
పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కల్పన కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ వీఆర్ఏ కల్పనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దీనివల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని అన్నారు. బాధ్యులపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సిబ్బందిని కార్యాలయాల్లో స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా ప్రతిరోజూ చుట్టుముట్టి వేధించడం సరికాదన్నారు. కల్పన తన సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తులందరినీ శిక్షించకపోతే తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రవి చిన్నరాథోడ్, పెరుమండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
కల్పన ఆత్మహత్యాయత్న బాధ్యులను శిక్షించాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


