ఏసీబీ వలలో ఇలా చిక్కారు..
అదనపు కలెక్టర్‌ను ఇలా పట్టేశారు..! (ఫోటోలు)
కాకతీయ, హన్మకొండ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో ముగ్గురిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూపాయలు ఒక లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో అరవై వేలు తీసుకుంటున్న సమయంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి (డిఈఓ ఇన్‌చార్జిగా కూడా పనిచేస్తున్నారు)ను వారి అదనపు కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో విద్యాశాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది గౌస్, మనోజ్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ముగ్గురినీ ఏసీబీ అధికారులు కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో విచారిస్తున్నారు.



