- రేపు వరంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
- ప్రతికూల వాతావరణంతో నిన్నటి పర్యటన వాయిదా
- తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
- పంట నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్లు
- ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
- అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి
- ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి
- అవసరమైతే దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలి
- ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- అధికార యంత్రాంగానికి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇవాళ వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని రేవంత్ వివరించారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణలో మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరదసాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించిన సీఎం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి
ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని నియమించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్‌కు రిపోర్టు చేరాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్ఫష్టంచేశారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలని, చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్‌లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలి
వరంగల్‌లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్న సీఎం అవసరమైనన్ని పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని అని ఆదేశించారు. ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామగ్రిని కూడా ఉపయోగించుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వరదల్లో చిక్కుకున్నవారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇవాళ వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నాన్న సీఎం.. తుపాను ప్రభావిత జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజ…


