బోధనల్లో సృజనాత్మకత ఉండాలి
అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి
అల్ఫోర్స్ టైనీ టాట్స్ ఇంటెలిజెన్స్ ప్రారంభం
కాకతీయ, కరీంనగర్ : స్థానిక అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో నిర్వహించిన అల్ఫోర్స్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలోని పాఠ్యాంశాలను సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా బోధిస్తే విద్యార్థుల్లో పట్టు పెరుగుతుందని, వివిధ పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. భారత సాంకేతిక రంగం ప్రపంచవ్యాప్తంగా అనేక విజయాలు సాధిస్తోందని, ఇలాంటి నైపుణ్యాలకు నాంది పాఠశాల స్థాయిలోనే పటిష్టమైన బోధన ఉండాలని భావించారు.విద్యార్థుల్లో పలు విషయాలపై అవగాహన పెంచేందుకు పాఠశాల ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తూ అమలు చేస్తోందని, వాటిలో భాగంగానే అల్ఫోర్స్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన విద్యార్థుల్లో కొత్త విషయాలపై ఆసక్తి పెంచడంతో పాటు అన్వేషణాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన గ్రామర్ సిటీ, మ్యాథ్స్ మానియా, ఆదర్శకథలు, ఆరోగ్యకర ఆహారం-జంక్ ఫుడ్, వాటర్ సైకిల్, వంట చేసే విధానాలు, అగ్నిపర్వతాల ప్రభావం, గ్రహణం, సునామి, దేశంలోని విద్యా విధానాలు, అభివృద్ధి ముందు ఉన్న సమస్యలు వంటి పలు సమాచార స్టాళ్లు ఆకట్టుకున్నాయి.విద్యార్థుల దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయని తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


